ఉట్నూర్ ఐటిడిఏ నూతన పీఓకు సత్కారం
ఉట్నూర్ ఐటిడిఏ నూతన పీఓకు సత్కారం
బీఆర్ఎస్వి మాజీ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ నియోజకవర్గ బి ఆర్ఎస్ ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మంద మకరందను తన ఛాంబర్ లో బీఆర్ఎస్వి మాజీ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పీఓ మంద మకరంద మాట్లాడుతూ ఐటిడిఏ ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
