మే 7న జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ ఉదయం 9 గంటలకు నాగారంలోని రాజారామ్ స్టేడియంలో అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు రత్నాకర్, కార్యదర్శి నరాల రాజా గౌడ్ తెలిపారు.
అండర్-16, అండర్-18, అండర్-20 విభాగాలతో పాటు మహిళలు, పురుషుల విభాగాల్లో జంప్స్, త్రోస్ కేటగిరీలలో లాంగ్ జంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో పోటీలకు ఎంపికలు నిర్వహించనున్నారు.
ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 10వ తేదీన హనుమకొండలో జరగనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే అవకాశం పొందుతారని నిర్వాహకులు తెలిపారు. పోటీలకు హాజరుకావాలనుకునే క్రీడాకారులు ముందస్తు నమోదు కోసం 9989040776 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
