Telangana | నామినేటెడ్ పదవులపై చర్చ..

Telangana | నామినేటెడ్ పదవులపై చర్చ..

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక భేటీ నిర్వహించారు. నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపై చర్చలు జరిపినట్లు సమాచారం.

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా సీఎం రేవంత్‌రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం నామినేటెడ్ పోస్టులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా, డీలిమిటేషన్ అంశంపై చర్చల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర స్థాయిలో ఈ విషయంపై కీలక సమావేశాల్లో పాల్గొనే అవకాశముందని సమాచారం.

Leave a Reply