2students | మోహన్ బాబుపై కిడ్నాప్ కేసు నమోదు

2students | మోహన్ బాబుపై కిడ్నాప్ కేసు నమోదు

2students | మోహన్ బాబు, విష్ణులపై పోలీసు కేసు
విద్యార్థులు కనిపించకపోవడంపై తల్లిదండ్రుల ఫిర్యాదు
తిరుచానూర్ పోలీసుల దర్యాప్తు ప్రారంభం
మోహన్ బాబు యూనివర్సిటీపై విద్యార్థి సంఘాల నిరసనలు
బౌన్సర్ల దౌర్జన్యాలపై AISF, SFI, NSUI ఆగ్రహం

2students | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నటుడు మంచు మోహన్ బాబు, విష్ణు, పీఆర్వో సతీష్ పై పోలీసు కేసు నమోదైంది. అక్బర్, వినోద్ అనే ఇద్దరు విద్యార్థులు మోహన్ బాబు యూనివర్శిటీ ఫీజుల దోపిడీపై ప్రశ్నించారని, ఆ తర్వాత విద్యార్థులు కనిపించకపోయారని ఆ ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు తిరుపతి జిల్లా తిరుచానూర్ పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారు. దీంతో మోహన్ బాబుపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

2students
2students

విద్యార్థి సంఘాల నేతలను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు, అతడి యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద AISF, SFI, NSUI విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు దౌర్జన్యాలకు పాల్పడటం దుర్మార్గమని విద్యార్థుల నేతలు మండిపడ్డారు.
అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు తిట్టుకుంటుంటే, ప్రైవేట్ శక్తులు చట్టాన్ని అతిక్రమిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కనిపించకుండాపోయిన విద్యార్థి నేతలను తక్షణమే కనుక్కొని, దౌర్జన్యాలకు పాల్పడుతున్న బౌన్సర్లను అరెస్టు చేయాలని, విద్యార్థి సంఘ నాయకులకు ప్రాణహాని జరిగితే మోహన్ బాబే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.

click here for more

click here to read Family Suicide | ఒంట‌రిత‌న‌మే ప్రాణం తీసిందా..?