ఆ ఇద్దరు దేవతలకు జలాభిషేకం..
ఆ ఇద్దరు దేవతలకు జలాభిషేకం..
ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో శ్రీ కంఠమహేశ్వర స్వామికి సురమాంబ దేవికి గౌడ కులస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా బయలుదేరి గ్రామ పోలి మేరలోని ఎల్లమ్మ ఆలయంలో కొలువుతీరిన శ్రీ కంఠమహేశ్వరస్వామి సురమాంబ అమ్మవార్లకు జలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌడ కులపెద్దలు మాట్లాడుతూ.. శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబదేవి కళ్యాణాన్ని పురస్కరించుకొని 5 రోజులుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొంటూ మూడవరోజు స్వామివారికి, అమ్మవారికి జలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. సోమవారం స్వామివారి కల్యాణం ఉంటుందని అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమం అంతా గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని గౌడకుల చరిత్ర అందరికీ తెలిసేలా బుర్రకథ కళాకారుల ద్వారా ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌడ కుల పెద్ద శ్రీరామ్ సమ్మయ్య, ఆలయ కమిటీ చైర్మన్ కోరుకొప్పుల రాజన్న, సారకల్లు గౌడ్ పానుగంటి వెంకటేశ్వర్లు, గౌడ కులస్తులు రేసు ఎల్లయ్య, దీకొండ మల్లేష్, సూరిబాబు, పురుషోత్తం, తెలగాని శ్రీను, మంద సాయి, రేసు రాము, తిరుమల, సతీష్, సంపత్, సతీష్, సాయన్న, వెంకటేశ్వర్లు, కంకటి బాబు, నరసింహారావు, తిరుపతి, రాజు, నరేష్, యాసారపు సాయి, కార్తీక్, డాక్టర్ కళ్యాణ్, లక్షమన్, గుండేబోయిన రామకృష్ణ, సాయిబాబా, బత్తిని సత్యం, వెంకటేశ్వర్లు, శ్రీధర్, నల్లమాస్ మహేష్, దికొండ వెంకటేశ్వర్లు, గణేష్, అన్వేష్, రాజేష్, చందు, పానుగంటి రాము, కార్తీక్, కిషోర్, నరసింహారావు, నల్లమాసు వెంకన్న, చంద్రబాబు, రవి, సోమన్న, దయాకర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
