బార్ అసోసియేషన్ అధ్యక్షపదవికి నామినేషన్…

బార్ అసోసియేషన్ అధ్యక్షపదవికి నామినేషన్…
దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట సివిల్, ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది గొంది మురళీ మోహన్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. దమ్మపేట కోర్టు లో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తనను గెలిపిస్తే, న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు రావటానికి కృషి చేస్తానని, న్యాయవాదుల సమస్యలపట్ల, బార్ అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉడతనేని శ్రీనివాసరావు, శ్యాం సుధాకర్, లక్కినేని నరేంద్రబాబు, తామా బాలరాజు, దర్గా వలి, అరుణ కుమారి, టి .సంజయ్, గోళ్ళ భవానీ కృష్ణ యాదవ్ కాలం సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
