సత్తుపల్లిలో కేటీఆర్‌కు ఘన స్వాగతం

సత్తుపల్లి, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు (కేటీఆర్) బుధవారం సత్తుపల్లిలో ఘన స్వాగతం లభించింది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో సత్తుపల్లి చేరుకున్న కేటీఆర్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు.

అనంతరం అక్కడి నుంచి పట్టణంలో నిర్వహించనున్న ఓటరు సవరణ ప్రక్రియపై అవగాహన కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరిన కేటీఆర్, మార్గమధ్యలో బస్‌స్టాండ్ సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేటీఆర్ రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది