తెలంగాణ ఉద్యమకారుల సేవలు చిరస్మరణీయం

తెలంగాణ ఉద్యమకారుల సేవలు చిరస్మరణీయం

  • అధ్యక్షులు అంగిరేకుల బిక్షపతి
  • తెలంగాణ స్పూర్తిని చాటిన పబ్లిక్ క్లబ్

అచ్చంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అచ్చంపేట పబ్లిక్ క్లబ్ ఆవరణలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు అంగిరేకుల బిక్షపతి జాతీయ జెండాను ఆవిష్కరించి క్లబ్ సభ్యులు, పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని, రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన ఉద్యమకారులు, నాయకుల సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అనంతరం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, సీనియర్ నాయకులు పోకల మనోహర్‌, వెన్ను శ్రీనివాసులు ను పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు అంగిరేకుల బిక్షపతి, ప్రధాన కార్యదర్శి కన్నోజు మనోహర్ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్ను శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, పబ్లిక్ క్లబ్ ఉపాధ్యక్షుడు కందికొండ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి కన్నోజి మనోహర్ ప్రసాద్ (మన్ను పటేల్), కోశాధికారి పోకల ప్రవీణ్, సంయుక్త కార్యదర్శి ఫయ్యూమ్, క్లబ్ గౌరవ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply