పొనకల్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

పొనకల్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

జన్నారం, ఆంధ్రప్రభ:
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు జన్నారం మండలంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించారు. మొదటి విడతలో మంజూరై నిర్మాణం పూర్తయిన కొత్తకొండ గంగాధర్ ఇందిరమ్మ ఇంటిని స్థానిక సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన నిరుపేదలకు గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమర్ షరీఫ్, హౌసింగ్ ఏఈ లియాకత్ అలీ, ఉప సర్పంచ్ అప్పాల జలపతి, పంచాయతీ కార్యదర్శి ఆర్. రాహుల్, బిల్ కలెక్టర్ అనిల్ కుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply