War Effect | రిపబ్లిక్ వేడుకలు రద్దు
War Effect | రిపబ్లిక్ వేడుకలు రద్దు
War Effect | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ (Pakistan) తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇరాన్(Iran) పై అమెరికా-ఇజ్రాయెల్ (America-Israel) దాడుల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీనివల్ల పాకిస్థాన్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశం తీవ్ర ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటోంది. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా ఆకాశాన్నంటుతున్న చమురు ధరల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.
ఈనెల 23న జరగాల్సిన రిపబ్లిక్ వేడుకలను రద్దు (Republic Day celebrations cancelled) చేసింది. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా, ఈ ఏడాది అధికారిక వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. రిపబ్లిక్ వేడుకల రోజున ఆడంబరాలకు పోకుండా కేవలం జెండా ఆవిష్కరణకే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఉద్రిక్తతలు (Tensions), ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
