ప్రజా దర్బార్‌లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
రైతుల అసైన్‌మెంట్ భూముల ఆన్‌లైన్ నమోదు అంశంపై అధికారులకు తక్షణ చర్యల ఆదేశం
పెడన, ఆంధ్రప్రభ: పెడన నియోజకవర్గం తోటమూల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెడన శాసనసభ్యుడు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలు, రెవెన్యూ సమస్యలు తదితర అంశాలకు సంబంధించిన వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. ప్రజలు సమర్పించే వినతుల పట్ల అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేలా జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు.
ముఖ్యంగా పెడన మండలం జింజర్ గ్రామానికి చెందిన 63 మంది రైతులకు సంబంధించిన అసైన్‌మెంట్ భూముల పట్టాదారుల పేర్లను ఆన్‌లైన్ అడంగల్‌లో నమోదు చేయాలని కోరుతూ ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ ఈ-అర్జీపై అధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
