రికార్డుల్లో పేరు తారుమారు..?

  • ఉన్నత చదువులకు ఇబ్బందులు..!
  • డీఈఓ కు వినతి

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : రికార్డులలో తారుమారైన పాఠశాల పేరును సరిచేయాలనీ చిల్లాపురం గ్రామ సర్పంచ్ రామ నరసయ్య డీఈఓ కు వినతి పత్రం అందజేశారు. గతంలో చిల్లాపురం ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉన్న కాలం నుండి పాఠశాల రికార్డులలో ఒక సాంకేతిక పొరపాటు దొర్లిందని సర్పంచ్ వివరించారు.

చిల్లాపురం గ్రామ పేరు లచ్చమ్మగూడెం గా, లచ్చమ్మగూడెం పేరు చిల్లాపురం గా రికార్డులలో తారుమారై నమోదవుతూ వస్తోందని పేర్కొన్నారు. దీనివల్ల చిల్లాపురం గ్రామ విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు, సర్టిఫికేట్లు, ఇతర ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు పొందేటప్పుడు తీవ్రమైన సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కావున విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాత రికార్డులలో దొర్లిన ఈ పొరపాటును సరిచేసి, మా గ్రామ అసలు పేరు అయిన చిల్లాపురంగా మార్చవలసిందిగా జిల్లా విద్యాధికారినీ వినతిపత్రంలో కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు లింగంపల్లి జలంధర్, మెరుగు జంగయ్య, లింగంపల్లి అంజి ఉన్నారు.