మార్కాపురం కలెక్టర్ గా విజయ సునీత బాధ్యతలు స్వీకరణ

మార్కాపురం కలెక్టర్ గా విజయ సునీత బాధ్యతలు స్వీకరణ

మార్కాపురం బ్యూరో, ఆంధ్రప్రభ : మార్కాపురం జిల్లాకు మొదటి జిల్లా కలెక్టర్ గా నూతనంగా నియమితులైన ఎం. విజయ సునీత శనివారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా అధికారులతో కలిసి తన ఛాంబర్ లో కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాలతో కలిసి మార్కాపురం జిల్లాను ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఇప్పటి వరకు ప్రకాశం కలెక్టర్ పి రాజబాబు ఇంచార్జ్ కలెక్టర్ గా వ్యవహారించారు.

ఇటీవల జరిగిన కలెక్టర్ ల బదిలీలలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కమీషనర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ సునీత ను నూతనం గా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లా కలెక్టర్ గా నియమించడం తో శనివారం విజయ సునీత మార్కాపురం కలెక్టరేట్ లో మార్కాపురం మొదటి కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. నూతన కలెక్టర్ ను మార్కాపురం జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, రెవిన్యూ డివిజన్ అధికారి ప్రభాకర్ తో పాటు పలువురు అధికారులు కలిసి స్వాగతశుభాకాంక్షలు తెలిపారు.