victory | తమిళనాడుకు ఇప్పుడు మంచి కాలం
victory | తమిళనాడుకు ఇప్పుడు మంచి కాలం
victory | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తున్న వేళ, ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ స్పందించారు. విజయ్ కాబోయే ముఖ్యమంత్రిగా అవతరించబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
విజయ్‌కు తన గెలుపుపై ఒక్క శాతం కూడా అనుమానం లేదని, అందుకే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తమిళనాడుకు ఇప్పుడు మంచి కాలం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.
సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన విజయ్‌కు ఎప్పటినుంచో ఉందని, ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు విజయ్‌ను తమ ఇంటి బిడ్డలా చూసుకున్నారని, ముఖ్యంగా మహిళలు, యువత ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని చంద్రశేఖర్ చెప్పారు. ఈ ప్రేమే ఎన్నికల్లో విజయంలో ప్రతిబింబించిందని పేర్కొన్నారు.
