వేపలగడ్డతండా కాంగ్రెస్ నూతన కమిటీ ఎన్నిక
గ్రామ అధ్యక్షుడిగా కొర్ర శీను.. ఉపాధ్యక్షుడిగా రొయ్యల భాస్కర్ ముదిరాజ్
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని వేపలగడ్డతండా గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా కొర్ర శీను, ఉపాధ్యక్షుడిగా రొయ్యల భాస్కర్ ముదిరాజ్తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాదె మహేందర్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కావటి భాస్కర్, మండల ఇన్చార్జి కొత్త కర్ణాకర్రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. తమ నియామకానికి సహకరించిన మండల కమిటీతో పాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు.
