జూలై 14లోపు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించండి
- ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ప్రతి ఓటరూ సహకరించాలి
- సహాయం కోసం మీ బిఎల్ఓ ను సంప్రదించాలి
- జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితాను సంపూర్ణంగా, పారదర్శకంగా రూపొందించే లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమానికి కృష్ణా జిల్లా ఓటర్లందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. బీఎల్ఓల ద్వారా అందజేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే నింపి తిరిగి అందజేయడం ద్వారా ప్రతి అర్హుడి ఓటు హక్కును పరిరక్షించవచ్చని ఆయన తెలిపారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఇందులో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
క్షేత్రస్థాయిలో పర్యటించిన సందర్భంగా చాలామంది ఓటర్లు ఫారాలు తీసుకున్నప్పటికీ వాటిని తిరిగి సమర్పించడంలో జాప్యం జరుగుతున్నట్లు గుర్తించామని చెప్పారు. జూలై 14వ తేదీలోపు అన్ని ఫారాలను డిజిటలైజ్ చేయాల్సి ఉన్నందున ప్రతి ఓటరు వెంటనే తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని సంబంధిత బీఎల్ఓకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇంకా ఫారం అందని వారు తమ బీఎల్ఓను సంప్రదించి సహాయం పొందవచ్చని తెలిపారు. అలాగే voters.eci.gov.in వెబ్సైట్ లేదా ECI NET యాప్‌లోని “Book a Call with BLO” సదుపాయం ద్వారా బీఎల్ఓతో నేరుగా సంప్రదించి ఫారం పొందడం, ఫారం నింపడంపై మార్గదర్శకత్వం, ఇతర అవసరమైన సహాయం పొందవచ్చని వివరించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామని, వాటి ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచామని చెప్పారు. సందేహాలు ఉన్నవారు హెల్ప్‌డెస్క్‌లను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఓటర్లు తమ ఎపిక్ (EPIC) నంబర్ ఆధారంగా voters.eci.gov.in వెబ్సైట్లో స్వయంగా కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని ఆన్లైన్లో సమర్పించవచ్చని తెలిపారు. ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, ఒక్క అర్హుడూ ఓటర్ల జాబితా నుంచి మినహాయింపుకు గురికాకుండా చూడడమే ఎన్నికల సంఘం లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృష్ణా జిల్లా ప్రజలందరూ చురుకుగా భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కృష్ణా జిల్లా ఓటర్ల హెల్ప్‌డెస్క్ ఫోన్ నంబర్లు
జిల్లా కాల్ సెంటర్: 1950
కృష్ణా, మచిలీపట్నం: 8555824148
71 – గుడివాడ నియోజకవర్గం
గుడివాడ రూరల్ – 08676-252394, 98495 31437
గుడ్లవల్లేరు – 91544 21421
ఉండివాడు – 99126 90094
72 – గుడ్లవల్లేరు నియోజకవర్గం
గుడివాడ మున్సిపాలిటీ – 87126 24774
నందివాడ – 90007 57704, 99593 39569
వీరంకిలాకు – 86882 32206
74 – పెదన నియోజకవర్గం
పెదన – 91218 98555
పెదన మున్సిపాలిటీ – 94948 88236
గూడూరు – 90002 93252, 92906 19283
బంటుమిల్లి – 91216 27563
కృత్తివెన్ను – 95424 24463, 90143 00000
75 – మచిలీపట్నం నియోజకవర్గం
మచిలీపట్నం (గ్రామీణ) – 96400 29918
మచిలీపట్నం (పట్టణం) – 88977 33535
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ – 93981 69847
76 – అవనిగడ్డ నియోజకవర్గం
అవనిగడ్డ – 99599 06480
చల్లపల్లి – 96762 12791
మోపిదేవి – 81432 99118
నాగాయలంక – 63042 35007
కోడూరు – 91337 88610
ఘంటసాల – 93981 56795
77 – పామర్రు (ఎస్సీ) నియోజకవర్గం
పామర్రు – 97033 94919
పమిడిముక్కల – 81850 65950
గుడ్లవల్లేరు – 63048 81697
ముదినేపల్లి – 84660 34359
కలిదిండి – 83749 2161
78 – పెనమలూరు నియోజకవర్గం
పెనమలూరు – 93980 25224
కంకిపాడు – 70135 39973
విజయవాడ రూరల్ – 97055 36206
ఉయ్యూరు మున్సిపాలిటీ – 90001 68972
కంకిపాడు మున్సిపాలిటీ – 99661 42299
పాత్రికేయుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్ పాల్గొన్నారు.
