ఎన్టీఆర్ ఆశయాల సాధనకు టీడీపీ కట్టుబడి ఉంది:

ఎన్టీఆర్ ఆశయాల సాధనకు టీడీపీ కట్టుబడి ఉంది:

కంచికచర్ల, ఆంధ్రప్రభ తెలుగు వారి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేసిన కృషి చిరస్మరణీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. కంచికచర్ల ఓసీ క్లబ్‌లో క్లస్టర్–9 పరిధిలో గురువారం నిర్వహించిన వర్చువల్ మహానాడు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే సౌమ్య, అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. మహానాడు వేడుకల సందర్భంగా సీనియర్ కార్యకర్తలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ, పేదల సంక్షేమం, తెలుగు వారి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఎన్టీఆర్ చేసిన కృషి తరతరాలకు మార్గదర్శకమని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడమే టీడీపీ లక్ష్యమని స్పష్టం చేశారు.

అంతకుముందు మండలంలోని కీసర కళ్యాణ మండపంలో క్లస్టర్–8లో వర్చువల్ మహానాడు కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, క్లస్టర్ యూనిట్ కన్వీనర్లు, కో–కన్వీనర్లు, పోలింగ్ బూత్ ఇన్‌చార్జులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అదేరోజు ఓసీ క్లబ్‌లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు.

Leave a Reply