జెండా ఆవిష్కరించిన ఈఓ రమాదేవి..

వేములవాడ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో రమాదేవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అంతకుముందు స్వామివారి ఆలయంలో అర్చక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం ఈవో రమాదేవి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జై తెలంగాణ నినాదాల మధ్య జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు.

కార్యక్రమం అనంతరం స్వీట్లు పంపిణీ చేసి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, సిబ్బంది, భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply