పొద్దు తిరుగుడు కొనుగోలు పునఃప్రారంభం
బెజ్జంకి, ఆంధ్రప్రభ : పొద్దు తిరుగుడు పంట కొనుగోలు ప్రక్రియలో కొంత ఆలస్యం చోటుచేసుకున్నప్పటికీ, రేపటి నుండి తిరిగి కొనుగోలు ప్రారంభించునున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. బెజ్జంకి మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రానికి రైతులు తమ పంటను తీసుకువచ్చి విక్రయించుకోవాలని సూచించారు.. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
