Velpur | బోర్లకు మరమ్మతులు

Velpur | బోర్లకు మరమ్మతులు

  • మంచినీటి కార్యక్రమం చేపట్టిన నూతన సర్పంచ్..

Velpur | వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని రామన్నపేట గ్రామంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన గ్రామ సర్పంచ్ బెల్టారి నవీన్ గ్రామంలోని ప్రజలకు మంచినీటిని అందించాలనే ఆలోచనతో గ్రామంలో ఉన్న బోర్లన్నింటిని గ్రామపంచాయతీ సిబ్బందితో వాడకంలో లేని పాత నీటి బోర్లను పరిశీలించి వాటి మరమ్మతు చేపట్టారు.

అలాగే పారిశుద్ధ్యంపై దృష్టి సారించి గ్రామ రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించే కార్యక్రమం చేపట్టి, డ్రైనేజీ వ్యవస్థ, గ్రామంలో పరిశుభ్రంగా ఉండేవిధంగా పాలన కొనసాగిస్తామన్నారు. అలాగే గ్రామస్తులకు ఏవైనా సమస్యలుంటే తమకు, పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకురావాలని గ్రామ ప్రజలకు సర్పంచ్ బేల్దారి నవీన్ సూచించారు..

Leave a Reply