మున్సిపల్ కార్మికుడి మృతికి నివాళి

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : ఆర్మూర్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న బాబాపూర్ గ్రామానికి చెందిన మున్సిపల్ కార్మికుడు గంగాధర్ (55) ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరి బాబాపూర్ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున అంత్యక్రియల నిమిత్తం రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీహరి రాజు, మున్సిపల్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.