Utkoor మహిళాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం

Utkoor మహిళాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం

  • మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే సమాజాభివృద్ధి సాధ్యం

ఊట్కూర్ (Utkoor), ఆంధ్రప్రభ:

మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రభుత్వం అందిస్తున్న రుణాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుక భరత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డి. యజ్ఞేశ్వర్ రెడ్డి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శివలీల అన్నారు.

మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభకు తరలివెళ్తున్న మహిళల కోసం ఏర్పాటు చేసిన బస్సును వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళల సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. మహిళలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రుణ సదుపాయాలను వినియోగించుకుని స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలని సూచించారు.

మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం, అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్, ఏపీఎం హరినారాయణ, కార్యదర్శి రాధా, కోశాధికారి అనిత, సీసీలు విజయ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply