ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి భూమి పూజ..
ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి భూమి పూజ..
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మున్సిపాలిటీ కేసముద్రం విలేజ్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లోన వార్డు కౌన్సిలర్ వల్లందా ఉమా రవి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కీర్తి శ్రీలత, సోసుకాండ్ల సుభాష్ రెడ్డి, అజ్మీరా రమేష్ పాల్గొని భూమి పూజ నిర్వహించి ముగ్గు పోయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కీర్తి సురేందర్ మాట్లాడుతూ మహబూబాద్ నియోజకవర్గంలో ప్రతి అర్హుడైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటున్న శాసనసభ్యులు భూక్య మురళి నాయక్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెర శాల శ్రీనివాస్, నాయకులు ఒల్లందాస్ రవి, పోలేపాక నాగరాజు , తండావాసులు తదితర కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది,
