రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ స్టేడియంలో జూన్ నెలలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జరిగే బాస్కెట్‌బాల్ పోటీల ఏర్పాట్లను పరిశీలిస్తూ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్టేడియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి జీఎం తో కలిసి బాస్కెట్‌బాల్ కోర్టులో అవసరమైన మార్పులు, సౌకర్యాలు కల్పించి ఆటగాళ్లకు అనుకూలంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచనలను చేశారు. అలాగే పోటీలకు హాజరయ్యే ఆటగాళ్లకు వసతి, భోజన సదుపాయాలు సమకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జిఎం,జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్, టౌన్ ప్రెసిడెంట్ దేవన్,మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీను , కౌన్సిలర్లు, సింగరేణి జీఎం, ఆటగాళ్లు తదితరులు పాల్గొన్నారు.
