మండల టిడిపి కన్వీనర్ గోవిందుకు ఘన సన్మానం..

మండల టిడిపి కన్వీనర్ గోవిందుకు ఘన సన్మానం..

మినీ మహానాడులో శుభాకాంక్షల వెల్లువ

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ మండల తెలుగుదేశం పార్టీ నూతన కన్వీనర్‌గా ఎంపికైన గోవిందుకు బుధవారం ఘన సన్మానం జరిగింది.

మండలంలోని రాకెట్ల గ్రామంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి నూతన నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గోవిందు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల టిడిపి సీనియర్ నాయకులు పెద్ద ముష్టూర్ నెట్టెం రామకృష్ణ, నెట్టెం రామ్మోహన్, శివ, ఇంద్రావతి సుధాకర్, రామకృష్ణ, మాజీ ఎంపీపీ సుంకరత్నమ్మ, మాజీ సర్పంచ్ ఎర్రగుంట్ల వెంకటేశులు, బోస్ తదితరులు పాల్గొన్నారు.