NZB | అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే..

  • సేవకు మారుపేరు ఆర్యవైశ్యులు..
  • ఆర్యవైశ్య సంఘం ఉగాది వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే..

నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు. సేవా కార్యక్రమాల్లో ఆర్య వైశ్యులు ముందుంటారని సేవకు మారుపేరు ఆర్య వైశ్యులని అని అన్నారు.

ఆదివారం నగరంలోని కిసాన్ గంజ్ లో ఆర్య వైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించి న ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆర్యవైశ్య పట్టణ సంఘ సభ్యులు అర్బన్ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు పంచాంగ శ్రవణం పఠించారు. సంఘ సభ్యులు అర్బన్ ఎమ్మెల్యేను శాలువాతోఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. నిరుపేద ఆర్యవైశ్యులకు అండగా ఉండాలి. మేము ఉన్నామంటూ ధైర్యం కల్పించాలనీ కోరారు. ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండాలని ఐక్యతతోనే ఏదైనా సాధ్యమని సూచించారు.

అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని అర్బన్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు కొండవీరశేఖర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి కసబ్ సంపత్ కుమార్ గుప్తా, కోశా ధికారి కాపర్తి వెంకటేష్ గుప్తా, అనుబంధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు ఆర్య వైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply