భీమ్గల్ మండలంలో 98 శాతం ఉత్తీర్ణత%
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో భీమ్గల్ మండలం 98 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాశాఖ అధికారి డి.స్వామి తెలిపారు. మండలంలో 813 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా,800 మంది పై ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు. సరస్వతీ విద్యామందిర్కు చెందిన బి.వెంకట హరిణి 577 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచినట్లు తెలిపారు.
ఎం సాయి స్మైలిక 576 మార్కులు సాధించి, 575/600 జి.ప్రజనీత జ్ఞానోదయ పాఠశాల ముచ్కూర్, జడ్.పి.హెచ్.ఎస్ గోనుగోప్పుల పాఠశాలకు చెందిన కె.రఘు 575/600, సాధించాడు. ద్వితీయ స్థానంలో నిలిచింది. మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థులను అలాగే భీమ్గల్ పట్టణ ప్రభుత్వ పాఠశాలలో 500 పైగా మార్పులు సాధించిన 11మంది విద్యార్థిని విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి డి.స్వామి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
