రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి….

రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి….

జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ

నరసరావుపేట, ఆంధ్రప్రభ : జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీ టెలీకాన్ఫెరెన్స్ లో మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. దీనికోసం అవసరమైన ప్రతిపాదనలను, పరిష్కారాలను రూపొందించాలని సూచించారు. ​

రీసర్వే ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక మరియు క్షేత్రస్థాయి సమస్యలు, జాయింట్ ఎల్పీఎం, 22 ఏ, అన్-సర్వేయిడ్ & అన్-సెటిల్డ్ గ్రామాలు, ఎస్టేట్, ఈనాం గ్రామాల సమస్యలు, ఈనాం భూములకు సంబంధించి ఉన్న న్యాయపరమైన, రెవెన్యూ చిక్కులు, ఎండీఆర్, వెబ్ ల్యాండ్, అడంగల్ రికార్డులు, ​వ్యవసాయ సాగు పట్టాలు, ఇళ్ల పట్టాలు, టైటిల్ డీడ్లు తదితర అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రతి సమస్యను నిశితంగా పరిశీలించి, పరిష్కారానికి సమగ్ర నివేదికలను రూపొందించాల్సి ఉందని ఇంచార్జి కలెక్టర్ పేర్కొన్నారు. వాటి పరిష్కార దిశగా కృషి చేయాలి అని అన్నారు.​

Leave a Reply