విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో రాణించాలి

విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో రాణించాలి

గ్రంథాలయాధికారి శ్రీనివాసరావు

శావల్యాపురం, ఆంధ్రప్రభ : విద్యార్థులు చదువుతో పాటు ఆట పాటల్లో రాణించాలని గ్రంథాలయాధికారి రావూరి శ్రీనివాసరావు అన్నారు. వేసవి విజ్ఞాన శిక్షణ కార్యక్రమంలో భాగంగా శావల్యాపురం సెంటర్లోని శాఖాగ్రంథాలయంలో సోమవారం విద్యార్థులతో పుస్తక పఠనం, క్యారమ్ బోర్డు తదితర ఆటలతో పాటు, గేయాలు పాడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ గ్రంథాలయాలకు వచ్చి వివిధ రకాల పుస్తకాలను చదవడం ద్వారా వారికి అన్ని విషయాలపై అవగాహన ఏర్పడి వారిలో విజ్ఞానం పెరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.

Leave a Reply