ఎస్‌ఐఆర్ సర్వేలో పాల్గొన్న మానిగూడ సర్పంచ్..

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మానిగూడ గ్రామంలో గురువారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) సర్వేలో గ్రామ సర్పంచ్ కుమ్ర దేవుషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓ, బీఎల్‌ఏలతో కలిసి ఆయన స్వయంగా ప్రజల సర్వే ఫారాలను నింపించి, సర్వేపై అవగాహన కల్పించారు.

సర్పంచ్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్ సర్వేలో పాల్గొని బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలకు సహకరించాలని కోరారు. తమ పూర్తి వివరాలను అందించి సర్వే ఫారాలను సక్రమంగా నింపి ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.