తుంగభద్ర డ్యామ్ నూతన గేట్ల ప్రారంభోత్సవానికి మంత్రి పయ్యావుల కేశవ్‌కు ఆహ్వానం
కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధులతో మర్యాదపూర్వక భేటీ
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
కర్ణాటక శాసనసభ్యులు బసవరాజు, రాజారెడ్డి, శాసనమండలి సభ్యులు బసవన్న గౌడ, బసవరాజు కలిసి ఈ నెల 25న కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యామ్ వద్ద నిర్వహించనున్న నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రిని ఆహ్వానించారు.
తుంగభద్ర డ్యామ్‌లో మరమ్మతు పనులలో భాగంగా పాత గేట్ల స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన గేట్లను ప్రారంభించనున్నట్లు ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పయ్యావుల కేశవ్‌ను కోరారు.
ఆహ్వానాన్ని స్వీకరించిన మంత్రి, తుంగభద్ర డ్యామ్ ప్రాంత అభివృద్ధి, నీటి వనరుల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ప్రతినిధులతో స్వల్పంగా చర్చించారు.
