అకాల మరణాలపై నేతల పరామర్శ
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన కుటుంబాలను మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శనిగరం రజిని నవీన్ పరామర్శించారు.
పరకాల మున్సిపాలిటీ 17వ వార్డు మల్లారెడ్డిపల్లి కాలనీకి చెందిన గుర్రం కిషన్ తల్లి గుర్రం పుష్ప అకాల మరణం చెందారు. అలాగే మున్సిపాలిటీ సిబ్బంది బుస్సా కుమార్ తండ్రి ఐలయ్య కూడా అకాల మరణం చెందారు.
విషయం తెలుసుకున్న రేగూరి విజయపాల్ రెడ్డి, 13వ వార్డు మాజీ కౌన్సిలర్ శనిగరం రజిని నవీన్ అక్కడికి చేరుకొని మృతదేహాలను సందర్శించి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోటం భద్రయ్య, ఎండీ అల్తాఫ్, అడ్వకేట్ సుజయ్ రాణా, పల్లెబోయిన రంజిత్, రాయబారపు అనిల్, చెట్టి ఏసుదాసు, దామ శివ, ఏఎంసీ డైరెక్టర్ నక్క చిరంజీవి, తోట రవీందర్, కనుకుంట్ల రాజేష్, మహిళా నాయకురాలు ఎండీ షాహిన్, బండారి కోమల, కనుకుంట్ల లక్ష్మి, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
