Trivikram | మూవీ గురించి మరో ట్విస్ట్..

Trivikram | మూవీ గురించి మరో ట్విస్ట్..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మైథలాజికల్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో కథ రెడీ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాలి అనుకున్నారు. బన్నీకి కథ చెప్పడం.. ఓకే అనడం.. అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే.. ఊహించని విధంగా బన్నీ అట్లీతో మూవీ చేస్తుండడం తెలిసిందే. దీంతో త్రివిక్రమ్.. ఈ కథను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు చెప్పి ఒప్పించారు. ఎన్టీఆర్ తో ఫిక్స్ అనుకుంటే.. ఇప్పుడు మరో హీరో పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. ఎవరా హీరో..? అసలు ఏం జరుగుతోంది..?

ఇది కార్తికేయకు సంబంధించిన కథ. ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ ఈ కథ చెప్పినప్పటి నుంచి.. ఈ కాంబో పై మరింత క్రేజ్ ఏర్పడింది. యంగ్ టైగర్ అయితే.. కార్తికేయకు సంబంధించిన పుస్తకాన్ని చదవడం కూడా స్టార్ట్ చేసేసారు.. ఆ పుస్తకం పట్టుకుని తిరుగుతున్నారంటే.. ఎంతలా ఈ కథకు కనెక్ట్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా జనవరి 9న రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆతర్వాత జూన్ 25న రిలీజ్ అని ప్రకటించారు. అయితే.. జూన్ 25న రావడం కూడా కష్టమే అని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ మళ్లీ ఐకాన్ స్టార్ దగ్గరకు వెళ్లిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై బన్నీ వాసు ఆమధ్య స్పందించారు. చాలా సిన్సిటీవ్ ఈష్యూ ఇది. త్వరలో క్లారిటీ వస్తుందన్నారు. ఇలా రియాక్ట్ అవ్వడంతో.. మళ్లీ బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో మైథలాజికల్ మూవీ రాబోతుందా అనే మాటలు వినిపించాయి.

అయితే.. బన్నీ లోకేష్ కనకరాజ్ తో సినిమాని అనౌన్స్ చేసి సర్ ఫ్రైజ్ చేశాడు. దీంతో త్రివిక్రమ్.. ఎన్టీఆర్ కాంబోలోనే మైథలాజికల్ మూవీ అనుకుంటుంటే.. సడన్ గా రామ్ చరణ్ పేరు తెర పైకి వచ్చింది. చరణ్ తో త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ చేసే ఛాన్స్ ఉందని కొత్తగా ప్రచారం జరుగుతోంది. దీంతో మైథలాజికల్ మూవీ అనేది న్యూటర్న్ తీసుకుని సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. మరి.. ఏం జరగనుందో..? ఫైనల్ గా ఈ క్రేజీ ప్రాజెక్టులోకి ఎవరు వస్తారో చూడాలి.
