National Highway | ఇద్దరు యువకుల దుర్మరణం

National Highway | ఇద్దరు యువకుల దుర్మరణం
National Highway | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భువనగిరి బైపాస్ వద్ద హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
పోలీసుల వివరాల ప్రకారం.. చందుపట్ల గ్రామానికి చెందిన జమ్మల లక్ష్మీకాంత్, సంగారెడ్డికి చెందిన వనపర్తి ప్రమోద్ బైక్‌పై ప్రయాణిస్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాద ధాటికి ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
