ఎర్రగొండపాలెం – ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంగించడంతో నమోదైన ఐదు కేసులలో విచారణకు రావాలని కోరుతూ . వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు 41ఎ చట్టం కింద నోటీసులు జారీ చేశారు. 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి చెవిరెడ్డి పోటీ చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎర్రగొండపాలెంలో మూడు కేసులు, పెద్దారవీడు, దోర్నాలలో ఒక్కొక్క కేసు నమోదయింది. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో చెవిరెడ్డికి పోలీసులు నోటీసులు అందించారు. ఈ కేసుల్లో ఎర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను బెదిరించిన కేసు కూడా ఉంది.
AP | విచారణకు రండి …వైసిపి నేత చెవిరెడ్డికి పోలీసులు నోటీస్..
