Grain| కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి..
Grain| ఘంటసాల, ఆంధ్రప్రభ : రైతు సేవా కేంద్రాల ద్వారానే ధాన్యం విక్రయించుకోవాలని తహసీల్దార్ బి.విజయప్రసాద్ తెలిపారు. ఘంటసాలపాలెంలోని చినదళితవాడలో ధాన్యం సంచుల్లోకి ఎత్తిన రైతుతో ఆయన మాట్లాడుతూ.. మండలంలో సంచుల సమస్య లేదని, తేమ శాతం కూడా రైతు సేవా కేంద్రం సూచించిన దానిని బట్టే ధర నిర్ణయించటం జరుగుతుందని తెలిపారు. రైసు మిల్లర్లు ఏలాంటి అభ్యంతరం తెలిపినా రైతు సేవా కేంద్రాల్లోని టెక్నికల్ అసిస్టెంట్ ను తీసుకెళ్లి తేమశాతం ఎంత ఉందో చూపించటం జరుగుతుందని అన్నారు. ఆఫ్ లైన్ ద్వారా ధాన్యం తోలుకోవద్దని రైతు కంచర్ల కోటేశ్వరరావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.
