Hockey| రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపిక

Hockey| కొత్తచెరువు, ఆంధ్రప్రభ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్–14 బాలికల రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో కొత్తచెరువు గర్ల్స్ హై స్కూల్ విద్యార్థిని పీవీ భవానా (8వ తరగతి) అద్భుత ప్రతిభ చూపించి 2వ స్థానం సాధించింది. ఈ విజయంతో పీవీ భవానాకి తదుపరి స్థాయి సెలక్షన్ కూడా లభించగా.. పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఆమె ప్రతిభకు పిడి గురువు సూర్యనారాయణమ్మ మార్గదర్శకత్వం అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నూర్జహాన్ మాట్లాడుతూ.. భవానా కృషి, క్రీడాస్ఫూర్తి తమ పాఠశాలకు గౌరవం తెచ్చాయని.. భవిష్యత్తులో రాష్ట్రం, దేశ స్థాయిలో కూడా మెప్పించేలా శిక్షణ అందిస్తారని తెలిపారు. ఉపాధ్యాయ బృందం, గ్రామస్థులు, తల్లిదండ్రులు ఆమెపై గర్వం వ్యక్తం చేస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
