అంగరంగ వైభవంగా ఆదివాసీల జాతర..

అంగరంగ వైభవంగా ఆదివాసీల జాతర..
ఆళ్లపల్లి/గుండాల, ఆంధ్రప్రభ : గుండాల మండలంలో జరిగే ఆదివాసీ ఇలవేల్పుల జాతరలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు చేబోతు రంజిత్ కుమార్ రవి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతర అత్యంత పురాతనమైనదని, ప్రతీ ఏడాది మాఘపున్నమి తర్వాత కులదైవం పండుగలను, జాతరను సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటామని, సమాజంలో జాతరల వ్యవస్థ అతిప్రాచీనమైనదని, మండలంలో నాయకపోడు కుల దైవం శ్రీరాయి పాపయ్య-అనమాల కన్నయ్య జాతరను బుధవారం నిర్వాహకులు ఘనంగా ప్రారంభించారు.
ఈ జాతర వందేళ్లుగా పూర్వికుల నుండి ఆనవాయితీగా వస్తుందని, కులదైవమైన శ్రీ రాయి పాపయ్య – అనమాల కన్నయ్యలను ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తూన్నామని నిర్వాహకులు తెలిపారు. మూడు రోజులపాటుగా జరిగే జాతర శుక్రవారం గర్భగుడిలో మండ మెలిగిన అనంతరం సాయంత్రం ఆదివాసీ నాయపోడు ఆడబిడ్డ లక్ష్మీ దేవరను కులస్తులైన ప్రతీ ఇంటికి తీసుకువెళ్లి తొక్కిడి చేసి, ఆడబిడ్డ లక్ష్మీ దేవరకు చీరేసారెలను భక్తిశ్రద్ధలతో సమర్పించారని తెలిపారు.
గురువారం వారి కులదైవాన్ని గుట్ట నుండి తీసుకువచ్చి గంగా స్నానానికి వెళ్లి, వచ్చే క్రమంలో గుండాల పురవీధుల గుండా డోలి చప్పులతో, ఆదివాసీ నృత్యాలతో, వడ్డెల పునకాలతో అంగరంగ వైభవంగా గర్భగుడికి చేర్చుతారని, శుక్రవారం భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి జాతర నిర్వాహకులు చేబోతు రంజిత్ కుమార్, చేబోతు రవి, చేబోతు రాజు, రాజబాబు, రమేష్, దబ్బదేవేందర్, దబ్బగిరిబాబు, శోభన్ బాబు, సింగం కుమార్, గోవింద నరసింహారావు, పాండ్ల నగేష్, దేవిరెడ్డి వీరకుమార్, దేవిరెడ్డి సీతారాములు, మేకల సమ్మయ్య, రమేష్, పాండ్ల సాయి, గోవింద బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.
