Drunk Driving | సిడ్నీలో…

Drunk Driving | సిడ్నీలో…

Drunk Driving | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టయ్యాడన్న వార్త క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో డేవిడ్ వార్నర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు అయినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించి వచ్చే నెలలో కోర్టులో హాజరు కావాలని వార్నర్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం వార్నర్ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ పరిణామం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

Leave a Reply