training | నూతన సర్పంచ్‌లకు 5 రోజుల శిక్షణ…

training | నూతన సర్పంచ్‌లకు 5 రోజుల శిక్షణ…

  • జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

training | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు గ్రామాలలో ఆదర్శవంతమైన పరిపాలన అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. ఈ రోజు పెద్దపల్లి మదర్ థెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో నూతన సర్పంచ్‌లకు 5 రోజుల పాటు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన నూతన సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.

పంచాయతీ పాలనలో వచ్చిన మార్పులను సర్పంచ్‌లు అర్థం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు చేరుతాయని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు, పన్నుల వసూలు, ఇతర ఆదాయ మార్గాలు, బడ్జెట్ రూప కల్పన, పంచాయతీలో పాలన వ్యవహారాలు, పారిశుధ్య నిర్వహణ, గ్రీన్ బడ్జెట్ తదితర అంశాల పై 5 రోజులపాటు సర్పంచ్‌లకు శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వచ్చిన మార్పులను కూడా సర్పంచ్‌లు గమనించాలనీ, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటూ పంచాయతీ అభివృద్ధికి నిధులు ఎలా సమకూర్చుకోవాలి, గ్రామ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, గ్రామంలో నూతన నిర్మాణాలు, లే ఔట్ లకు అనుమతుల మంజూరుకు పాటించాల్సిన నియమ నిబంధనల వంటి అంశాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితి అధికారి వీర బుచ్చయ్య, జడ్పీ సీఈఓ నరేందర్, సంబంధిత అధికారులు, సర్పంచ్ లు పాల్గొన్నారు.

Leave a Reply