Training | సర్పంచులకు శిక్షణ తరగతులు…

Training | సర్పంచులకు శిక్షణ తరగతులు…

Training | చిట్యాల, ఆంధ్రప్రభ : నల్లగొండ గ్రామీణ అభివృద్ధి సంస్థ డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో సోమవారం నుండి బుధవారం వరకు జరుగుతున్న శిక్షణ తరగతులకు చిట్యాల మండల సర్పంచ్ లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిట్యాల మండలం సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం మాట్లాడుతూ… సర్పంచ్‌లకు సోమవారం నుండి బుధవారం వరకు మూడు రోజులపాటు సర్పంచుల బాధ్యతలు, విధులు, నిధులు, వినియోగం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే విధానాలపై అధికారులు అవగాహన కల్పించడం, మాకు, గ్రామాల అభివృద్ధి, ఇతర విషయాలపై శిక్షణ తరగతులు ఉపయోగపడతాయనీ, బుధవారం చివరి రోజు శిక్షణ తరగతులు పూర్తి అవుతాయని అన్నారు.

Leave a Reply