చేంగల్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

చేంగల్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ:
భీమ్‌గల్ మండలంలోని చేంగల్ గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని సోమవారం ప్రారంభించారు. స్పెషల్ ఆఫీసర్ సీసీ నరేష్, స్థానిక గ్రామ సర్పంచ్ దుమల మమత రాజు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు.
ప్రజా ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి సునీల్ కుమార్ ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దుమల మమత రాజు మాట్లాడుతూ, అర్హులైన పేదలకు సొంతింటి కలను నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దిలీప్, ఏఎంసీ డైరెక్టర్ నరసాపురం జీవన్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆర్మూర్ రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నూతుల రమేష్, అడపా రాజేశ్వర్, గిరిని నర్సారెడ్డి, తూర్పు శ్రీధర్, శోభన్ గౌడ్, నూతుల వసంత్ రెడ్డి, బాబా గౌడ్, ఆనంద్ గౌడ్, చెవ్వ ప్రశాంత్, సంగెం సురేష్, దిలీప్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
