Tragic incident | సరయూ నదిలో యువకుడిని…
Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఉత్తర్ ప్రదేశ్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోండా జిల్లాలో సరయూ నది ఘాట్ వద్ద అంత్యక్రియలకు వెళ్లిన ఓ యువకుడిపై మొసలి దాడి చేసి నీటిలోకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నోయిడాకు చెందిన దీపక్ అనే వ్యక్తి తన అత్త ఊర్మిళ అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులతో కలిసి సరయూ నది ఘాట్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో చితి ఏర్పాటు కోసం గుంత తవ్వుతున్న సమయంలో నదిలో దాగి ఉన్న మొసలి ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. దీపక్ తలను పట్టుకుని మొసలి నీటిలోకి లాక్కెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.
