conflict | టిఫిన్ సెంటర్‌లో కలకలం

conflict | టిఫిన్ సెంటర్‌లో కలకలం

conflict | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : సుచిత్రలోని ఓ టిఫిన్ సెంటర్‌లో చిన్న వివాదం ఘర్షణకు దారితీసింది. టిఫిన్‌లో చట్నీ ఎక్కువ వేయలేదన్న కోపంతో ఓ వ్యక్తి హోటల్ సిబ్బందిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

స్థానిక టిఫిన్ సెంటర్‌కు వచ్చిన ఓ కస్టమర్ టిఫిన్‌తో పాటు చట్నీ ఎక్కువ వేయాలని సిబ్బందిని కోరాడు. అయితే హోటల్ సిబ్బంది అందుకు నిరాకరించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి లోనైన వ్యక్తి హోటల్‌లో ఉల్లిపాయలు కోసే కత్తిని తీసుకుని అక్కడే ఉన్న సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఈ దాడిలో హోటల్ సిబ్బందితో పాటు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల అరుపులతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.