Skip to content
Saturday, September 5, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

ఇది ఆటో డ్రైవర్లకు ఎన్నికల్లో ఇవ్వని హామీ

Bala Raju October 4, 2025 account,  Autodrivers,  CM Chandrababu Naidu,  ganja,  green tax,  history,  Kandula Durgesh,  Link Roads,  Pemmasani Chandrasekhar,  Women Power

ఇది ఆటో డ్రైవర్లకు ఎన్నికల్లో ఇవ్వని హామీ

  • మంత్రి కందుల దుర్గేష్

గుంటూరు, ఆంధ్రప్రభ : ఆటో డ్రైవర్లకు కూటమి సర్కారు అండగా ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్(Kandula Durgesh) భరోసానిచ్చారు. శనివారం గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrasekhar), స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా ఇంచార్జ్ మంత్రి కందుల దుర్గేష్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని వివరించారు. ఆటోలో తమ ప్రయాణ అనుభూతులను గుర్తు చేసుకున్నారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ పథంలో ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలని నినదించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆటోడ్రైవర్ల(Autodrivers) సేవలో కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.

తద్వారా రాష్ట్రవ్యాప్తంగా సొంత వాహనం కలిగిన ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 2,90,669 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున రూ.436 కోట్లు నేరుగా జమ చేస్తున్నామన్నారు. గుంటూరు జిల్లాలో 13,194 మంది లబ్ధిదారుల ఖాతా(Account)ల్లో దాదాపు రూ.20 కోట్లు జమ చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రయాణీకులు ముందుగా ఆధారపడేది ఆటోలపైనే అని మంత్రి దుర్గేష్ అన్నారు. బస్సులు సైతం వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు కూడా ఆటోలు వెళ్తూ ప్రయాణీకులకు సేవలు అందిస్తున్నాయన్నారు. పగలు, రాత్రి కష్టపడుతూ స్వయం కృషితో ఎదిగిన ఆటో డ్రైవర్లకు మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు.

ఎన్నికల్లో ఇవ్వని హామీ అమలు

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం స్త్రీ శక్తి(Women Power కార్యక్రమం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసినప్పుడు తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆటోడ్రైవర్లు తమకు విన్నవించారని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా వారి బాధలు, గాథలు విన్న కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నాకూడా ఆటో డ్రైవర్లకు సేవలో కార్యక్రమం ద్వారా ఆర్థిక భరోసా అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు(CM Chandrababu Naidu)కు ఆటో డ్రైవర్ల తరపున మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.

తేడా గమనించండి

గత ప్రభుత్వం వాహనమిత్ర క్రింద రూ.10,000 ఇచ్చిందని మంత్రి దుర్గేష్ అన్నారు. కానీ నాడు గ్రీన్ ట్యాక్స్ భారీగా విధించడం, రోడ్లు అధ్వాన్నంగా ఉండటం, పోలీస్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం తదితర కారణాల వల్ల ఆ సొమ్ము దేనికీ ఉపయోగంలో లేకుండా పోయిందన్నారు. పైగా గత ప్రభుత్వం అనుసరించిన అనాలోచిత విధానాల వల్ల అదనంగా ఆటో డ్రైవర్లు మరో రూ.10 వేలు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి నెలకొన్నవిషయాన్ని, నాడు ఆటోడ్రైవర్లు అనుభవించిన ఇబ్బందులను, ఎదుర్కొన్నఅవాంతరాలను కళ్లకు కట్టినట్లుగా వివరించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో లింక్ రోడ్లు(Link Roads) వేస్తున్నామన్నారు.

ఆర్ అండ్ బీ రోడ్లు వేస్తున్నామన్నారు. గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా ప్రధాన రహదారులు అన్నీబాగుచేశామన్నారు. గ్రీన్ ట్యాక్స్ ను రూ. 3 వేలకు తగ్గించామన్నారు. తద్వారా సజావుగా ప్రయాణం సాగి, పెట్రోల్ ఆదా జరుగుతుందన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అందించిన రూ.15000 ఆర్థిక సాయం కుటుంబ అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం లభించిందన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని మంత్రి కందుల దుర్గేష్ భరోసానిచ్చారు. ఆటో డ్రైవర్లు స్వయం కృషితో ఉపాధి సృష్టించుకొని చరిత్ర(History) సృష్టిస్తున్నారని అన్నారు.

ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చడం కోసం ప్రభుత్వం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తుందన్నారు. విశిష్ట అతిథి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ నిరంతరం స్టీరింగ్ తో బతుకు ప్రయాణాన్నికొనసాగిస్తున్నఆటోడ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో రోడ్లు బాగుపడ్డాయన్నారు. తద్వారా వాహన యజమానులకు మరమ్మత్తుల ఖర్చులు తగ్గాయన్నారు.

ఆటో డ్రైవర్లపై భారం పడకుండా గ్రీన్ ట్యాక్స్(Green Tax) తగ్గించామన్నారు. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీవో అధికారుల నుండి ఏవైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. శాంతి భద్రతలకు పెద్దపీట వేసి గంజాయి(Cannabis) వాడకాన్ని తగ్గించామన్నారు. బడ్జెట్‌లో 60 శాతానికి పైగా సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర సమిష్టి కృషితో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో చేపడుతున్నామన్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సభకు అధ్యక్షతవహించారు.

ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ఆటోలకు పర్మిట్ ఇవ్వొద్దని, తద్వారా స్థానికంగా ఉండే ఆటోడ్రైవర్ల పొట్టకొట్టినట్లుందని ఆటోడ్రైవర్లు విన్నవించారు. కుల, మత, ప్రాంత, పార్టీ, వర్గాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తోందని వక్తలు పేర్కొన్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrasekhar), జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని పలువురు ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఘంటాపథంగా చెప్పారు.

గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా గమనించాలని సూచించారు. సంక్షేమం ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఉండాలన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాస రావు, మేయర్ కోవెలమూడి రవీంద్రబాబు, డిప్యూటీ మేయర్ షేక్ సజీల, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రవాణా అధికారి సీతారామ్ రెడ్డి, హజ్ కమిటీ ఛైర్మన్, ఏపీ ఇండస్ట్రీస్ ఛైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ టెక్నాలజీస్ ఛైర్మన్ మోహన కృష్ణ, వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ మల్లేల ఈశ్వరరావు, జనసేన జిల్లా ఇంచార్జ్ గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

  • మ‌రింత అభివృద్ధి
  • ముగించేశారు

You May Also Like

Adilabad | రిమ్స్ లో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య

July 30, 2025 Bala Raju

విశాఖ ఫార్మా సిటీలో భారీ అగ్నిప్రమాదం

June 23, 2026 Praneeth Kumar

తెలంగాణవాసుల కోసం సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్

August 27, 2026 Abhi Naga

Final Rites | మురళీనాయక్ కు రేపు అంత్యక్రియలు .. హాజరుకానున్న పవన్, లోకేష్

May 10, 2025 Gopi Krishna

AP | రెండున్నరేళ్లలోనే కోట్ల రుణ విముక్తి..

June 17, 2026 Pavan Chandragiri

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ స‌ర్కార్‌కు ఎదురుదెబ్బ

October 16, 2025 Bala Raju

కార్టూన్ ‘ఔరా’:

30thAugust Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • హైదరాబాద్‌లో టాటా మెగా ఇన్వెస్ట్‌మెంట్‌..
  • విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువులే..
  • కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి
  • ఏఐసీసీ ఒప్పుకోలేదు : టీపీసీసీ అధ్య‌క్షుడు
  • ఇందిరా పార్క్ వ‌ద్ద బీజేపీ మహాధర్నా
  • సెప్టెంబర్‌ 7న ఆటో కార్మికులతో భేటీ : మంత్రి పొన్నం ప్రభాకర్‌
  • ఉప్పల్‌ నల్ల చెరువుకు పూర్వవైభవం.. హైడ్రా కృషితో సరికొత్త రూపు
  • డేటా, ఏఐ, డేటా సెంటర్లదే భవిష్యత్‌..
  • రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ.. ప్రజాపాలన అంటారా.. ? .. తలసాని
  • సీఎం రేవంత్‌కు కవిత వార్నింగ్‌

తాజా వార్తలు :

  • హైదరాబాద్‌లో టాటా మెగా ఇన్వెస్ట్‌మెంట్‌..
  • Tribal-Health-Advanced-Tests : గిరి బి్డ్డ‌ల‌కు అడ్వాన్స్ థెర‌ఫీ Andhta Prabha Top Story
  • Asia Cup | నేడే భారత్‌–పాక్‌ సమరం..
  • విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువులే..
  • కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి
  • ఏఐసీసీ ఒప్పుకోలేదు : టీపీసీసీ అధ్య‌క్షుడు
  • ఏపీలో కొత్తగా 4 పోలీస్‌ కమిషనరేట్లు!
  • రామనామ ఘోషతో మార్మోగిన మల్లికార్జునపేట..
  • Rural-Cctv-Surveillance ఇక ఊరూరా నిఘా Andhra Prabha Exclusive Story
  • వైభవంగా ‘విజయవాడ ఉత్సవ్’

అంతర్జాతీయం :

  • Gold Rate Today September 5 2026 | Andhra Prabha Gold News |ప‌సిడి ధ‌రకు బ్రేక్‌.. కొనుగోలుదారుల‌కు హ్యాపీ!
  • Indian Stock Market -Weekly Outlook – Next Week From September 7 2026| షేర్ మార్కెట్‌కు మళ్లీ ఎదురుగాలి!… సెప్టెంబర్‌ రెండో వారం మార్కెట్‌ ఎటు?
  • Openai-Ai-Aagents-Hijack-Ggerman-Website భ‌లే OpenAI దొంగ‌లు Andhra Prabha Top Story
  • Rain |జలమయమైన ఎయిర్‌పోర్ట్‌.. ఐఎండీ భారీ హెచ్చరిక
  • US Military Turns Off Ad Trackers | సైనికుల ఫోన్లపై శత్రువుల కన్ను.. అమెరికా ‘యాడ్‌ ట్రాకర్ల’కు కట్‌!

జాతీయం :

  • Gold Rate Today September 5 2026 | Andhra Prabha Gold News |ప‌సిడి ధ‌రకు బ్రేక్‌.. కొనుగోలుదారుల‌కు హ్యాపీ!
  • వరద నీటిలోనే పెళ్లి బంధం.. వాయిదాకు నో చెప్పిన ప్రేమజంట!
  • Indian Stock Market -Weekly Outlook – Next Week From September 7 2026| షేర్ మార్కెట్‌కు మళ్లీ ఎదురుగాలి!… సెప్టెంబర్‌ రెండో వారం మార్కెట్‌ ఎటు?
  • ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది విద్యార్థులు మృతి
  • మోదీతో క్రాఫ్టన్‌ చైర్మన్‌ భేటీ

కెరీర్ :

  • లైఫ్‌ని గాడిలో పెట్టే ‘వింట‌ర్ ఆర్క్’..
  • డిగ్రీతో పాటు విలువలు..
  • ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌కు డేట్ ఫిక్స్ !
  • AP Special TET 2026 | ఏపీ టీచర్లకు గుడ్‌న్యూస్‌.. స్పెషల్‌ టెట్‌ షెడ్యూల్‌ విడుదల
  • ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..
  • టీజీలాసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies