టీటీడీ బోర్డులోని కూటమి సభ్యుల మధ్య ఆధ్యాత్మిక వార్

టీటీడీ బోర్డులోని కూటమి సభ్యుల మధ్య ఆధ్యాత్మిక వార్

తిరుపతి, ఆంధ్రప్రభ, రాయలసీమ : తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన సభ్యుడు టీటీడీ పాలకమండలి(TTD Governing Body) సభ్యుడు ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలపై మ‌రో పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయన భగవద్గీతపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వెంటనే వెనక్కి తీసుకోవాలని, హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తాజాగా మడకశిర ఎంఎల్ ఏ(Madakasira MLA) కూడా అయిన టీటీడీ బోర్డు సభ్యుడు ఎం ఎస్ రాజు ఒక సమావేశంలో మాట్లాడుతూ భగవద్గితను అవమానించే విధంగా చేసిన ప్రసంగం వివాదాస్పదమైంద‌న్నారు. ఆ విషయంపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆయన పై విరుచుకు పడుతూ ఆయన్ని టీటీడీ బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డులో సభ్యుడుగా ఉన్న బీజేపీ(BJP) సీనియర్ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి(Bhanuprakash Reddy) ఈ రోజు ఎంఎస్ రాజు పై ధ్వజమెత్తారు. భగవద్గీతను అవమానించే వ్యాఖ్యలు సమాజంలో విభేదాలు రేకెత్తిస్తాయని, అటువంటి వ్యాఖ్యలను ప్రజలు సహించరని హెచ్చరించారు. హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Leave a Reply