కార్మికుల సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

కార్మికుల సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

టేకుమట్ల, ఆంధ్రప్రభ : ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అని తక్షణమే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి ఆర్టీసీ సమ్మె బలిదానాలకు పరిష్కారం కావు. పోరాటమే మార్గం. పోరాడితే పోయేదేమీ ఏమిలేదు బానిస సంకెళ్లు తప్పా.. అనే నిదానంతో ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఇప్పుడు విషాద ఛాయల్లో చిక్కుకుంది. నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రయత్నం చేసి చికిత్స పొందుతూ మరణించడo అత్యంత బాధాకరం. తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్ ఎక్కిన ఒక సామాన్య కార్మికుడు ప్రభుత్వం నుండి సానుకూలత స్పందన రాకపోవడంతో మనస్థాపానికి గురై పెట్రోల్ పోసుకొని ప్రాణాలు తీసుకోవడం చాలా బాధాకరం.

ఆ కుటుంబానికి తీరని లోటు. కార్మిక లోకం తమ పోరాటాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం రాజ్యాంగబద్ధమైన హక్కు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మరణానికి నైతిక బాధ్యత వహించాలని.. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వలన చర్చలు జరపకుండా జాప్యం చేయడం సరైనది కాదు అని.. తక్షణమే చర్చలు జరిపి కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. శంకర్ గౌడ్ కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నాం. ప్రభుత్వం కళ్లు తెరిచేలా ప్రభుత్వం మెడలు వంచి మన సమస్యలను పరిష్కారం కోసం పోరాటాలను ఉధృతం చేయాలని, శాంతియుతంగా కార్మిక లోకానికి పిలుపు నిచ్చారు.

Leave a Reply