గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలి..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని ప్రముఖ వ్యాపారి విద్యావేత్త సుభాష్ రెడ్డి అన్నారు. మండలంలోని కాచాపూర్ గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గంగమ్మ కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దయవల్ల సమృద్ధిగా వర్షాలు పడే పంటలు పండాలని తెలిపారు.

ప్రతి కుటుంబం సంతోషంగా జీవించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అన్నారు. ఆలయానికి వచ్చినా ఆయనకు గంగపుత్ర సంఘం ప్రతినిధులు ఘనస్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఆయన వెంట గంగపుత్ర సంఘం ప్రతినిధులు, సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు ఉన్నారు.