The Raja saab | మెలొడీ సాంగ్ రిలీజ్..

The Raja saab | మెలొడీ సాంగ్ రిలీజ్..

The Raja saab, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఈ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ రాజా సాబ్. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ సహన సహన.. అప్ డేట్ వచ్చేసింది. ఈ బ్యూటీఫుల్ మెలొడీ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. సహన సహన.. ఫుల్ లిరికల్ సాంగ్ ను ఈ నెల 17న సాయంత్రం 6.35 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సహన సహన.. సాంగ్ లో ప్రభాస్ కలర్ ఫుల్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ తో ఆల్ట్రా స్టైలిష్ వైబ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సాంగ్ ను మ్యూజిక్ సెన్సేషన్ తమన్ తన కెరీర్ బెస్ట్ మెలొడీగా కంపోజ్ చేశారు. ప్రభాస్, నిధి అగర్వాల్ లపై చిత్రీకరించిన సహన సహన.. పాటలో స్టన్నింగ్ లొకేషన్స్ లో హైలైట్ గా నిలుస్తున్నాయి.

సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న రాజా సాబ్ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా రాజా సాబ్ మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాజా సాబ్ రిలీజ్ కోసం రెబల్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply