Peddi Movie | అమ్మవారి ని దర్శించుకున్న ‘పెద్ది’ చిత్ర బృందం

Peddi Movie | అమ్మవారి ని దర్శించుకున్న ‘పెద్ది’ చిత్ర బృందం

ప్రత్యేక పూజలు నిర్వహించిన డైరెక్టర్ బుచ్చిబాబు, నిర్మాత వెంకట సతీష్ కిలారు
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు

Peddi Movie | ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత వెంకట సతీష్ కిలారు మంగళవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం దేవస్థాన వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం, పవిత్ర చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. రాబోయే ‘పెద్ది’ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ చిత్ర బృందం అమ్మవారి కృపాకటాక్షాలు కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply